భద్రకాళి చెరువు మట్టి తరలించే టిప్పర్ లారీ లు హంటర్ రోడ్ లో వెనుక నుండి స్కూటీని ఢీకొట్టిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. డ్రైవర్లు మద్యం మత్తులో విచ్చల వేడిగా నిర్లక్ష్యంతో టిప్పర్ లారీలు నడుపుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనలో స్కూటీ నుజ్జునుజ్జు కాగా సతీష్ రెడ్డి అనే వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నిత్యం ఈ టిప్పర్ల వలన హంటర్ రోడ్ లో ప్రమాదాల బారిన వాహనదారులు పడుతున్నారు.