బీరు, బిర్యానీ అంటూ పార్టీలు చేసుకొని సభ్యత మరిచిన వ్యక్తులు, ఆర్ఎస్ ప్రవీణ్ పై అనుచిత వాక్యాలు చేయడం ఏమిటని బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పుష్పిత లయ ప్రశ్నించారు. వరంగల్ బల్దియా ఆవరణలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎంతోమంది విద్యార్థుల మేలుకోసం అహర్నిశలు చేసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ పై కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు సరికావని తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు.