రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేదని, నేడు రొడ్డు భద్రతా మాసోత్సవం చేపడుతుందన్నారు.