వరద ముంపు ఎదుర్కోవడానికి ప్రణాళిక బద్ధంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు నగర మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. మంగళవారం ఇంజనీరింగ్-ఇన్-చీఫ్ మొహమ్మద్ జియాఉద్దీన్ కమీషనర్ అశ్విని తాణాజీ వాకడే తో కలిసి మేయర్ వడ్డేపల్లి బండ్, జవహర్ నగర్, అంబేద్కర్ భవన్, హన్మకొండ బస్ స్టాండ్, ములుగు రోడ్ లోగల ప్రభుత్వ ఐ టి ఐ కళాశాల, కొత్త వాడ, కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు.