ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టి సీఎం కప్ 2024ను విజయవంతం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం సీఎం కప్ నిర్వాహణపై సమావేశం జరిగింది. సీఎం కప్ తొలుత గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వివిధ కమిటీల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్ని స్థాయిలలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేయాలన్నారు.