వరంగల్ నగరంలోని చారిత్రాత్మక ఓరుగల్లు కోటకు వెళ్లే ప్రధాన రహదారి 38వ డివిజన్‌లోని ఖిలావరంగల్ పెట్రోల్ పంప్ సమీపంలో ఉన్న రోడ్డు మార్గం మూడు నెలల నుండి అస్తవ్యస్తంగా మారింది. డ్రైనేజి కోసం వేసిన ఇనుప కంచ దెబ్బతినడంతో స్థానిక ప్రజలు, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోకుండా తాత్సారం చేశారు. దీంతో రహదారి మళ్లీంపు కోసం ఆ ఇనుప కంచెపై కట్టెలు, జెండా పాతి దారి మళ్లీంచడం ఎంతవరకు సమంజసం అని స్థానిక ప్రజలు వాపోతున్నారు.