

‘తీస్తా ప్రహార్’.. ఆర్మీ భారీ సైనిక విన్యాసాలు (VIDEO)
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ పూర్తిగా అప్రమత్తమైంది. పశ్చిమబెంగాల్లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో 'తీస్తా ప్రహార్' పేరిట సైనిక విన్యాసాలు నిర్వహించుకుంది. నదీప్రాంతాల్లో యుద్ధ పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు వ్యూహాత్మకంగా సైనికులు కసరత్తు చేశారు. ఆయుధ సరఫరా, బలగాల మధ్య సమన్వయం, శత్రు వ్యూహాల ఎదుర్కొలు తదితర అంశాలపై ఫీల్డ్ స్థాయిలో శిక్షణ ఇచ్చారు.