హన్మకొండ ఎస్సై పరుశురాములు మంగళవారం రెడ్డి కాలనీ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నం చేయగా పట్టుకొని విచారించారు. కోటగిరి సాయి, అతని మిత్రుల దగ్గర రూ. 5 లక్షల 10-కిలోల ఎండు గంజాయి, రూ. 25 లక్షల 2-కిలోల హశీష్ ఆయిల్, 3- సెల్ ఫోన్ లు, రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ సైకిల్, బజాజ్ ఆటో స్వాధీనం చేసుకున్నారు.