ధర్మసాగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఉరేసుకుని జగన్నాథం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన జగన్నాథం అద్దె ఇంట్లో నివాసం ఉంటూ క్షౌరవృత్తి చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల కిందట కుటుంబ సభ్యులు బంధువుల ఊరేళ్లారు. తలుపులు తెరిచి ఉండటం, రెండ్రోజులుగా ఎవరూ బయటకు రావడం లేదని గుర్తించిన స్థానికులు గురువారం మధ్యాహ్నం వెళ్లి చూడగా.. జగన్నాథం మృతి చెంది కింద పడి ఉన్నారు. మెడలో ఉరి వేసుకున్న తాడు ఉంది. విషయాని పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి పరిశీలించారు. మూడ్రోజుల కిందటే ఉరి వేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.