దామెర మండలంలో విషాదం చోటుచేసుకుంది. వడదెబ్బతో తాపీ మేస్త్రీ మల్లేశం మృతి చెందారు. శనివారం మధ్యాహ్న సమయంలో పని చేస్తుండగా వడ దెబ్బకు గురయ్యాడు. గమనించిన స్థానికులు హాస్పిటల్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ మల్లేశం మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.