హనుమకొండ జిల్లాలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే ను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోసామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే మార్గదర్శకాల పై వివిధ శాఖల అధికారులు, జిల్లాలోని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంపీఎస్ వోలతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.