ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండలోని త్రిచక్ర పొదుపు, పరపతి పరస్పర సహకార సంఘం బాధ్యులు భారత రాష్ట్ర సమితి పార్టీ ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న మహాసభకు లక్షా నూట పదహారు రూపాయల విరాళాన్ని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కి శనివారం అందజేశారు. అంతేకాకుండా 800 ఆటోలు సభ రోజున స్వచ్ఛందంగా రావడం కాకుండా ప్రజలను తరలిస్తామని అన్నారు.