వర్ధన్నపేట: కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి మొండి చేయి

74చూసినవారు
వర్ధన్నపేట: కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి మొండి చేయి
వర్ధన్నపేట మండలంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ఇస్లావత్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ - ఖమ్మం రహదారి పైన నిరసన తెలియజేసారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో విద్యారంగానికి మొండి చేయి చూపిందని మండిపడ్డారు. విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు, ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేలా కుట్రలు చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్