హనుమకొండ ఎక్సైజ్ కాలనీలో గురువారం సాయంత్రం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అల్లుడు, యువజన నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి పర్యటించారు. కాలనీలో పర్యటించి తమ సమస్యలను పరోక్షంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలని విష్ణువర్ధన్ రెడ్డిని ఆహ్వానించగా, విస్తృతంగా పర్యటించారు. నిర్మాణంలో ఉన్న అంతర్గత రోడ్ల పనులను సైడ్ డ్రైన్ పనులను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు.