సిటీ స్పెషల్ బ్రాంచ్ కు బదిలీపై వెళ్లిన ట్రాఫిక్ ఎస్ఐ రావెళ్ల రామారావును పోలీస్ స్టేషన్ లో సోమవారం ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. ట్రాఫిక్ లో ఎటువంటి ఆటంకాలు లేకుండా సుదీర్ఘ కాలం పని చేసినటువంటి ఎస్సై రామారావు సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. క్రమశిక్షణ పట్టుదలతో పనిచేసిన వారిని ప్రజలు గుర్తిస్తారని రామారావు ఎస్ఐ పనిచేసి నిరూపించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.