కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) వైస్ ఛైర్ పర్సన్ గా చాహత్ బాజ్ పాయ్ శనివారం బాధ్యతలు చేపట్టారు.
బల్దియా కమిషనర్ గా కొనసాగుతున్న ఆమెను కుడా వైస్ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కుడా అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.