

రామప్ప ఆలయం వద్ద చీరకట్టులో సుందరీమణుల సందడి (వీడియో)
TG: ఓరుగల్లులో పర్యటించిన ప్రపంచ సుందరీమణులు తెలంగాణ సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. ములుగు జిల్లా రామప్ప దేవాలయ ప్రాంగణంలో తెలంగాణ సంస్కృతిని చాటేలా గుస్సాడీ నృత్యం, ఒగ్గుడోలు ప్రదర్శనతో స్వాగతం పలికారు. రామప్ప ఆలయం వద్ద చీరకట్టులో మెరిసిన అందాల భామలు గ్రూప్ ఫొటో షూట్లో పాల్గొన్నారు. రామప్ప ఆలయ విశిష్టతను టూరిజం గైడ్లు వారికి వివరించారు. ప్రభుత్వం మిస్ వరల్డ్ 2025 పోటీదారులతో కాళ్లు కడిగించి మన సంస్కృతిని పరిచయం చేసింది.