సర్వేంద్రీయానాం నయనం ప్రధానం అన్నది అక్షర సత్యమని, కంటి చూపు లేకుండా ఒక పూట కూడా జీవించలేమని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ అన్నారు. శనివారం వరంగల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో మట్టేవాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.