వీడియో కాన్ఫరెన్స్ లో గురువారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ జిల్లాలో ప్రతి 3 నెలలకు ఒకసారి అప్ డేట్ కావాలని, 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక పౌరుడికి ఓటు హక్కు కల్పించాలని అన్నారు. ఓటర్ జాబితా సవరణ, పోటీ చేసిన అభ్యర్థుల వివరాల సమర్పణ తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మార్చి 19 లోపు సమావేశాల నిర్వహణ పూర్తి చేయాలన్నారు.