జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారుడు

81చూసినవారు
జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారుడు
కలకత్తాలో ఈనెల 14 నుంచి 19 వరకు జరిగిన ఆల్ ఇండియా సబ్ జూనియర్స్ అండర్-13 బ్యాడ్మింటన్ పోటీలలో వరంగల్ బల్దియా ఇండోర్ స్టేడియం క్రీడాకారుడు శ్రీ చేతన్ శౌర్య ప్రతిభ కనబరిచాడు. జాతీయస్థాయి బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించినట్టు బల్దియా ఇండోర్ బ్యాడ్మింటన్ కోచ్ శ్రీధర్ రావు గురువారం వెల్లడించారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన టోర్నమెంట్లలో డబుల్స్ ఇండియాలో 3వ ర్యాంకు సాధించాడు.

సంబంధిత పోస్ట్