మధ్యప్రదేశ్ లోని బాలా ఘాట్ జిల్లా బోరి గ్రామానికి చెందిన శివలాల్ మార్స్కలే(30) వరంగల్ నుంచి నాగపూర్ వైపు వెళ్తున్న రైలులో ప్రయాణిస్తూ గురువారం ఉదయం ఉప్పల్ రైల్వే గేటు వద్ద జారిపడి, ట్రాక్ పక్కనున్న ఇనుపస్తంభానికి తల తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు కాజీపేట జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కె.వెంకట్రెడ్డి తెలిపారు. . అతడి జేబులో లభించిన ఫోన్ నంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు.