వరంగల్: త్వరలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీతక్క

51చూసినవారు
వరంగల్: త్వరలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీతక్క
తెలంగాణలో త్వరలోనే అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. వరంగల్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాను శుక్రవారం మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రారంభించారు. ఇలాంటి జాబ్‌మేళాను నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని, సొంత ఊరు దాటితేనే భవిష్యత్తు బంగారం అవుతుందని సీతక్క తెలిపారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని, అందుకే ఇలాంటి జాబ్‌మేళాను నిర్వహించామని కొండా సురేఖ అన్నారు.

సంబంధిత పోస్ట్