పని కోసమని సికింద్రాబాద్ కు వచ్చిన వరంగల్ వాసి అదృశ్యమయ్యాడు. వరంగల్ కరీమాబాద్ ప్రాంతానికి చెందిన ప్రసాద్ గోల్కొండ (37) బతుకు దెరువు కోసం సికింద్రాబాద్ కు చేరుకున్నాడు. నెల కిందట కుటుంబసభ్యులతో మాట్లాడి సికింద్రాబాద్‌లో ఓ హోటళ్లలో పనిచేస్తున్నానని సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ప్రసాద్ ఫోన్ చేయకపోవడంతో సికింద్రాబాద్ లో ప్రసాద్ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు.