ప్రజాస్వామ్యంలో ప్రజలను చైతన్య పరచడంలో న్యాయవాదులు, జర్నలిస్టుల పాత్ర కీలకమని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అన్నారు. ఇటీవల ఎన్నికైన హన్మకొండ, వరంగల్ జిల్లాల న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షులు పులి సత్యనారాయణ, వలుస సుధీర్, ప్రధాన కార్యదర్శులు కే. రవి, డి. రమాకాంత్ లను మంగళవారం ప్రెస్ క్లబ్ కార్యవర్గం వారిని ఘనంగా సన్మానించి, మెమంటోను అందజేశాలు.