అణగారిన మహిళల జీవితాలకు అక్షర చుక్కని సావిత్రిబాయి పూలే అని వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ మహిళా కార్యదర్శి డా. కే. గోపిక రాణి అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.