గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి పరిసర ప్రాంతాల్లో దేవుడి గుట్టపై 300 సంవత్సరాల క్రితం రంగనాథ స్వామి వెలిశాడు. ఈ రంగనాథ స్వామి ఒక ఊరిలో వెలిసి మరో ఊరిలో పూజలు అందుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయానికి శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించినట్టు స్థానిక యువత తెలిపారు. కనీస వసతులు లేక భక్తులు ఇక్కడికి రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.