వరంగల్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున శుక్రవారం డిమాండ్ చేశారు. బీ కేటగిరీ సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలన్నారు. డొనేషన్ల పేరుతో లక్షలు వసూలు చేస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నా సంబంధిత కళాశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.