సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ప్రతి నెల నిర్వహించే డ్రాయింగ్ పోటీల్లో భాగంగా సంక్రాంతి పండుగ అంశంతో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి మంగళవారం జిల్లా గ్రంథాలయాల ఛైర్మన్ మహ్మద్ అజీజ్ ఖాన్ బహుమతులు అందించారు. చిన్నారుల్లో చిత్ర కళను గుర్తించి పదును పెడుతున్న సాగంటి మంజులను అభినందిస్తున్నానన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులను అభినందించారు.