హనుమకొండ న్యూ సైన్స్ డిగ్రీ కాలేజీలో బుధవారం సైబర్ నేరాల పట్ల కాజీపేట ట్రాఫిక్ సీఐ నాగబాబు, ట్రాఫిక్ ఎస్ఐ రావెల రామారావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోన్ యాప్ ల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ పేరు మీద ఎటువంటి కాల్స్ వచ్చినా, నమ్మి మోసపోవద్దని బహుమతులు వచ్చాయని, లక్కీ డ్రా తగిలిందని, డ్రా లో విన్ అయ్యారని ఫేక్ కాల్స్ వస్తే నమ్మవద్దని సూచించారు.