ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా శనివారం సోమిడి పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సోమిడి జంక్షన్లో ర్యాలీ అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ డాక్టర్ సత్యేంద్రనాథ్ మాట్లాడుతూ. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆందోళన కారణంగా రక్త పోటు, డయాబెటిస్ కేసులు చాలా పెరుగుతున్నాయని తగిన జాగ్రత్తలు తీసుకోవడం, మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా వీటిని నియంత్రణించ వచ్చునన్నారు.