అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం సాయంత్రం 03: 00గం. లకు వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీఎం సెంటర్ వరకు యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. ఎంజీఎం సెంటర్ నుంచి హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించే అంబేద్కర్ విజ్ఞాన జ్యోతి యాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, నాయకులు విజయవంతం చేయాలని కోరారు.