బంగారు భవిష్యత్తుకు అంగన్వాడీలే పునాదులు: ఎమ్మెల్యే

78చూసినవారు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణం లోని ఫిరంగిగడ్డ అంగన్వాడీ కేంద్రం లో ఐసీడీఎస్ వర్ధన్నపేట ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో గురువారం అమ్మ మాట - అంగన్వాడి బాట కార్యక్రమాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు స్వయంగా అక్షరాభ్యాసం చేయించి, ఆప్యాయంగా వారితో మాట్లాడారు.
అదేవిధంగా న్యూట్రి గార్డెన్స్ లో ఎమ్మెల్యే నాగరాజు గారు అధికారులు కూరగాయ విత్తనాలు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్