వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్ నాగేరాజు ఆదేశాల మేరకు మడికొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మడికొండ చౌరస్తాలో కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వాక్యాలు చేసినందుకు కేటీఆర్ దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాజీపేట మండల పార్టీ అధ్యక్షులు శ్రీ సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి, 46వ డివి జన్ కాంటెస్ట్ కార్పొరేటర్ వస్కుల నాగమణి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.