వర్ధన్నపేట చెన్నారంకు చెందిన యువకుడు పెండ్యాల అక్షయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీరోల్ నుంచి రెండు కిలోల గంజాయి కొనుగోలు చేసి బస్సులో హనుమకొండకు వచ్చాడు. బుధవారం ఇద్దరు వ్యక్తులతో కలిసి గంజాయితో పంతినిలోని ఒక మెకానిక్ షెడ్ వద్దకు వస్తుండగా వెంబడించి పట్టుకొని తనిఖీ చేయగా, రెండు కిలోల ఎండు గంజాయి లభించింది. అక్షయ్ ను అదుపులోకి తీసుకోగా, ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.