ఎనుమాముల: ఎంఆర్ఓ విధులను అడ్డుకున్న వారిపై కేసులు

65చూసినవారు
వరంగల్ ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్సార్ నగర్ లో బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమి, స్థల పరిశీలనకు వరంగల్ మండల తాహసిల్దార్ ఇక్బాల్ వారి సిబ్బందితో మంగళవారం వెళ్లారు. ఎస్సార్ నగర్ కి చెందిన కేతిరి రాజశేఖర్, లావణ్య ప్రజలను మహిళలను రెచ్చగొట్టి, ఇండ్లు కూల్చి వేస్తున్నారని తప్పుడు సమాచారం ఇచ్చి దాడికి ప్రయత్నించినారని వారిపై కేసులు నమోదు చేశామని ఏనుమాముల సీఐ రాఘవేందర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్