What: ఆసియాలోనే అతిపెద్ద చర్చి, ప్రపంచంలో రెండో అతి పెద్దదిగా క్రిస్టియన్ సొసైటీస్ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని సొంతం చేసుకున్న హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరం క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. వారం రోజుల ముందు నుంచే సెమీ క్రిస్మస్ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రార్థనా మందిరాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఏసు జనన వృత్తాంతం నాటక ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి అనంతరం డిసెంబర్ నెలలో 25 తేదీన అనగా బుధవారం రోజు ఉదయం నుంచి అనేక రకాల ప్రత్యేకమైన ప్రార్థన చేసే నిర్వహించి అనంతరం జననం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం సిద్ధం చేశారు. ప్రార్థనా మందిరం ఆవరణలో పశువుల పాక, అందులో బాలయేసు జననం ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. బుధవారం క్రిస్మస్ వేడుకలకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 45 వేల నుంచి 50 వేల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేశారు.
Where: స్టేషన్గన్పూర్ నియోజకవర్గం