అక్రమ నిర్మాణం కూల్చివేత

64చూసినవారు
హన్మకొండ 55వ డివిజన్ భీమారంలో భారీ అక్రమ నిర్మాణాన్ని బల్దియా టౌన్ ప్లానింగ్ సిబ్బంది బుధవారం కూల్చివేశారు. లోకాయుక్త ఆదేశాల మేరకు అనుమతి లేని భవనాన్ని కొంత మేర నేలమట్టం చేశారు. అనుమతి లేకుండా భవనాలు నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవని బల్దియా అధికారులు హెచ్చరించారు. కూల్చి వేస్తున్న సమయంలో అధికారులతో ఇంటి యజమానులు కాసేపు వాగ్వాదానికి దిగారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్