వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మార్కెట్లో వ్యాపారులు, గుమాస్తాలు, హమాలి, దడ్వాయి కార్మికులు మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కల్పించాలని మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.