స్టేషన్ ఘనపూర్ మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో తొడెంగల మల్లయ్య, కృష్ణమూర్తి, ఐలయ్యల ముగ్గురి ఇల్లు పూర్తిగా కాలిపోయాయి. ఇంట్లో ఉన్న 20 క్వింటాల బియ్యంతో సహా అన్నీ బూడిదయ్యాయి. విలువైన పత్రాలు కూడా కాలిపోవడం జరిగింది. ప్రభుత్వం వారిని ఆదుకోవలసిందిగా కోరుతున్నారు.