రైతులు క్షేమంగా ఉండాలి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు 500రూపాయల బోనస్ ప్రకటించిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. గురువారం పర్వతగిరి మండల చౌటపల్లిలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సన్న వడ్లకు మార్కెట్ ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందిస్తున్నట్లు దీని కోసం 25వేల కోట్ల నిధులను సమాకూర్చినట్లు తెలిపారు.