హన్మకొండలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ టౌన్ డీఈజీ సాంబ రెడ్డి తెలిపారు. విద్యుత్ మరమ్మత్తుల కారణంగా కిషన్ పురా, లష్కర్ బజార్ ప్రాంతంలో ఉదయం 10 నుంచి 1 గంట వరకు, కాజీపేట మెయిన్ రోడ్, సోమిడి, వెంకటాద్రి నగర్, జూబ్లీ మార్కెట్, రహమత్ నగర్, విష్ణుపురి ప్రాంతంలో ఉ. 10 నుంచి 3 గంటల వరకు, సిద్ధార్థనగర్ ప్రాంతంలో ఉదయం 9 నుంచి 11.15 వరకు నిలిపేస్తామన్నారు.