హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 5న విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈజీ సాంబరెడ్డి మంగళవారం తెలిపారు. వడ్డేపల్లి, విజయ్ పాల్ కాలనీ, టీచర్స్ కాలనీ-2, జీఎంఆర్ అపార్ట్ మెంట్స్ ప్రాంతాల్లో ఉదయం 9. 30 నుంచి 11. 30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వివరించారు. వినియోగదారులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.