హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన రాజోజు మధును ఉత్తర తెలంగాణ ఉద్యమ కళాకారుల విభాగం ఎలుకతుర్తి మండల కో కన్వీనర్ నియమిస్తూ బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ నాకు అవకాశం కల్పించిన వేనమల్ల వెంకటేష్, గడ్డం సుధాకర్, పాలేటి రాజు ప్రతి ఒక కళాకారునికి కృతజ్ఞతలు తెలియజేశారు.