కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పర్వతగిరి మండలం ఎస్సారెస్సీ కెనాల్ కాలువ వద్ద శనివారం జరిగింది. ఈ ప్రమాదంలో కుమారుడు, తండ్రి, కూతురు మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్ కు గుండె నొప్పి వచ్చింది. దాంతో చికిత్స కోసం తిరిగి వరంగల్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గుండె నొప్పి ఎక్కువై కారు అదుపు తప్పి కాలువలో పడిందని సీఐ రాజ గోపాల్ తెలిపారు.