కాజీపేట మండలంలోని మడికొండలోని ప్రసిద్ధ శ్రీ మెట్టు రామలింగేశ్వర శైవ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ప్రాతః కాలం సమయం నుంచి భక్తులు శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఈవో శేషు భారతి, చైర్మన్ పైడిపాల రఘు చంద్ర, అర్చకులు అభిలాష శర్మ, విష్ణుశర్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శివ దేవునికి తమ భక్తి ప్రదర్శించారు.