కాజీపేట మండలం 45వ డివిజన్ తరాలపల్లి గ్రామంలో మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దర్గా కాజీపేట పీఏసీఎస్ ఛైర్మన్ ఊకంటి వనం రెడ్డి ప్రారంభించారు. 45వ డివిజన్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్, కాజీపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సారంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి, పులియాల సంపత్ రెడ్డి, బషీర్, కాజీపేట మండల వ్యవసాయ అధికారి సంతోష్ గ్రామస్తులు పాల్గొన్నారు.