కాజీపేట మండలం మడికొండ మెయిన్ రోడ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేస్తూ అంబేద్కర్ విగ్రహం దగ్గర జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో శనివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, గిడ్డంగుల సంస్థల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ పులి అనిల్ కుమార్, పింగళి వెంకట్రావు, నరసింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.