వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో కొలువై ఉన్న కొలను వేంకటేశ్వర స్వామివారి దేవాలయం జిల్లాలోనే ప్రత్యేకమైనది. తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ కొలను ఉండటంతో దీనికి కొలను వేంకటేశ్వరస్వామి అనే పేరు వచ్చింది. ఆరు శతాబ్ధాలుగా పూజలు లేకుండా ఉన్న 800 ఏళ్ల క్రితం నాటి ఈ దేవాలయాన్ని 2009లో పునరుద్ధరించారు.