ఎలాంటి అనుమతి లేకుండా పొగాకు, గుట్కా అక్రమ విక్రయాలపై టాస్క్ ఫోర్స్ బృందం విశ్వసనీయ సమాచారం మేరకు మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రావికంటి చంద్రశకర్ అనే నిందితుని వద్ద రూ. 1,96,800 విలువైన గుట్కా పట్టుకున్నామని తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుని మడికొండ పోలీసులకు అప్పగించామని టాస్క్ ఫోర్స్ సీఐ పవన్ కుమార్ తెలిపారు.