హన్మకొండ పంతిని శివారు లక్ష్మీపురం క్రాస్ వద్ద గురువారం ఖమ్మం వైపు వెళ్తున్న లారీ వరంగల్ వెళ్తున్న బైక్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన పోలీసులు గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.